This is my first poetry, I wrote it when I was studying diploma polytechnic.
సాగర సందేశం
అందనంత ఎత్తులోన మేఘం లో నీవుంటే
అందనంత లోతులోన సంద్రంలో నేనున్నా ,,,
ఎగసి పడే కెరటం లా నిన్ను చేర నా హృదయం
అణువణువున స్పందిస్తే నేను సహితం ఆవిరినై నిన్ను చేర వస్తున్నా...!
మేఘ సందేశం
మేఘం లో నేనున్నా సంద్రాన్నే చూస్తున్నా
ఏ దరిని నేనున్నా నీవైపే వస్తున్నా ,,,
చిరు గాలిని సాయమడిగి చినుకు లా జాలువారి
వరదలా నేను మారి ప్రవహిస్తున్నా నీ వైపే పరిగెడుతున్నా ...!